Share News

తెలంగాణపై మోదీ ప్రభుత్వంవివక్ష చూపుతోంది

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:37 PM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూ డా నిధులు కేటాయించకుండా మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తెలంగాణపై మోదీ ప్రభుత్వంవివక్ష చూపుతోంది
నిరసన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి జూపల్లి

- కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వలేదు

- రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వారికి గుణపాఠం తప్పదు

- మంత్రి జూపల్లి కృష్ణారావు

- కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

- మంత్రితో పాటు పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూ డా నిధులు కేటాయించకుండా మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బడ్జెట్‌లో తెలంగా ణకు నిధులు కేటాయించపోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం నాగర్‌క ర్నూల్‌ పట్టణంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, రాజేష్‌రెడ్డి లు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం అక్కడే బైటాయించి నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఏడాదికి దాదాపు రూ.3 లక్షల కోట్ల పన్నులు చెల్లిస్తున్నా తెలంగాణకు నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వం బడ్జె ట్‌లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఎన్‌డీఏలో భాగస్వామ్యమైన రాష్ట్రాల కే నిధులు కేటాయించి సమాఖ్య స్ఫూర్తికి విఘా తం కలిగించిందని విమ ర్శించారు. మోదీ ప్రభు త్వం నీళ్లు నిధులు కేటా యించకుండా అన్యాయం చేస్తున్నా పదేళ్ల పాటు అధికారం అనుభవించిన కేసీఆర్‌ మౌనంగా ఎందు కు ఉన్నారని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం లో ఏ ఎన్నిక జరిగినా బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకు లకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షుడు గంగాపురం రాజేందర్‌, నాయ కులు విజయ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పెద్ద కొత్తపల్లి మాజీ ఎంపీపీ తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:37 PM