Share News

మెటల్‌ రోడ్డు వేయించాలి

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:21 PM

పెద్ద పొర్ల గ్రామం నుంచి గాడుదుల వాగు ద్వారా ఊట్కూర్‌కు వెళ్లే రహదారిని మెటల్‌ రోడ్డుగా మార్చి రైతులను ఆదుకోవాలని పెద్దపొర్ల గ్రామ రైతులు ఆదివారం మక్తల్‌లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.

మెటల్‌ రోడ్డు వేయించాలి
మక్తల్‌లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతిపత్రం ఇస్తున్న పెద్దపొర్ల గ్రామస్థులు

- ఎమ్మెల్యేను కలిసిన పెద్దపొర్ల గ్రామస్థులు

ఊట్కూర్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పెద్ద పొర్ల గ్రామం నుంచి గాడుదుల వాగు ద్వారా ఊట్కూర్‌కు వెళ్లే రహదారిని మెటల్‌ రోడ్డుగా మార్చి రైతులను ఆదుకోవాలని పెద్దపొర్ల గ్రామ రైతులు ఆదివారం మక్తల్‌లో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. గ్రామంలోని 40 వ్యవసాయ కుటుంబాలు 200 ఎకరాల భూమిపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రోడ్డు వ్యవస్థ లేక నిత్యం ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. వెంటనే అధికారులతో మాట్లాడి మెటల్‌ రోడ్డు వేయించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను పరి ష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజ్ఞేశ్వర్‌రెడ్డి, పెద్దపొర్ల గ్రామస్థులు కొల్లూర్‌ శంకరప్ప, కొల్లూర్‌ భీంషప్ప, కొల్లూర్‌ నాగేష్‌, ఈదమెల్ల వెంకటయ్య, కోళ్ల కృష్ణయ్య, సుండు అంజప్ప, బుగ్గనోల్ల అంజప్ప, కొల్లూర్‌ శివ, ఎట్టి విజయ్‌, ఎట్టి ఆనంద్‌, జంబనోల్ల నర్సింహులు, కావలి బాలప్ప, మద్దెలబండ బాలప్ప తదితరులున్నారు.

Updated Date - Feb 09 , 2025 | 11:21 PM