Share News

రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించాలి

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:36 PM

రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం సెక్రటరీ శరత్‌చంద్ర అన్నారు.

 రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించాలి
అథ్లెటిక్స్‌ ఎంపికను ప్రారంభిస్తున్న జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం సెక్రటరీ శరత్‌చంద్ర

- జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం సెక్రటరీ శరత్‌చంద్ర

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రస్థాయి టోర్నీలో పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం సెక్రటరీ శరత్‌చంద్ర అన్నారు. హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 18, 19వ తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే జిల్లా అండర్‌-14, 16, 18, 20 సంవత్సలోపు బాల, బాలికల జట్ల ఎంపికలను గురువారం స్థానిక స్టేడియం మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌చంద్ర మాట్లాడారు. అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు రాణించాలని, ఎంతో మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ఉండగా ఉంటా మని, జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాభివృద్ధికి కృషి చేస్తా మన్నారు. ట్రెజరర్‌ ఆనంద్‌, జాయింట్‌ సెక్రటరీ రమేష్‌బాబు, పి.శ్రీనివాసులు, సీ. శ్రీనివాసులు, కోచ్‌ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:36 PM