ఆంగ్లంపై పట్టు.. సులభంగా కలిగేట్టు..
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:48 PM
విద్యార్థులు ఆంగ్ల భాషపై సులభంగా పట్టు సాధించడమే లక్ష్యం..

- డిజిటల్ పద్ధతిలో ఇంగ్లిష్ నేర్పించేందుకు చర్యలు
- విద్యార్థులకు భాషపై ఆసక్తి పెంచడమే ప్రధాన లక్ష్యం
- ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక తరగతి గది
- సొంత ఖర్చుతో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు సంతోష్
ఆత్మకూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు ఆంగ్ల భాషపై సులభంగా పట్టు సాధించడమే లక్ష్యం.. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభు త్వ పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దడమే ధ్యేయం.. అందుకోసం వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఓ తరగతి గదిలో అత్యాధునిక ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఆంగ్ల భాషపై ఆసక్తి పెరిగేలా డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన చేస్తున్నారు. తెలుగు మాధ్యమ విద్యార్థులు సై తం ఆంగ్ల భాషలో పట్టు సాధించేలా ఉపాధ్యాయుడు సంతోష్ కుమార్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆంగ్ల భాష అక్షరమాల నేర్పించడం నుంచి వాక్య నిర్మాణం, మాట్లాడటం వరకు వారికి శిక్షణ ఇస్తున్నారు.
ఆడియో, వీడియోలతో బోధన
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు, ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంచేందుకు పాఠశాలలోని ఓ తరగతి గదిలో ప్రొజెక్టర్, పెద్ద డిజి టల్ తెరను ఏర్పాటు చేశారు. నెల వారీగా పాఠ్యాం శాల బోధనకు ప్రణాళికను రూపొందించారు. అందు కు అనుగుణంగా ఆడియో క్లిప్పులు, వీడియో చిత్రా లను డిజిటల్ తెరపై ప్రదర్శిస్తూ విద్యార్థులకు ఇంగ్లిష్ నేర్పిస్తున్నారు. అలాగే విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా బోధనా సామగ్రి, కంప్యూటర్లను అందు బాటులో ఉంచారు. దీంతో పాటు తరగతి గది ఆకర్ష ణీయంగా కనిపించేలా విద్యుద్దీకరణ చేశారు. అందు కోసం ఉపాధ్యాయుడు సంతోష్‌కుమార్ రూ. 80 వేల వరకు సొంతంగా ఖర్చు చేశారు.
చక్కని చేతి రాత సాధన
ఆంగ్ల భాషపై పట్టు సాధించడంతో పాటు, విద్యా ర్థుల చేతిరాతను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతీ రోజు ఆంగ్ల అక్షర మాలను దిద్దడం, రాయడం అలవాటు చేశారు. దీంతో వారికి చక్కని చేతి రాత అబ్బింది. వారిలో కొందరు విద్యార్థులు పుస్తకాల్లోని అచ్చు అక్షరాలకు తీసిపోని విధంగా రాస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే మండల పరిధిలో జూరాల గ్రామ పాఠశాల విద్యార్థులు సైతం చేతిరాతను మెరుగుపరుచుకుని ఇంగ్లీష్ భాషలో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు.
ఆడియో, వీడియోలతో మెరుగైన బోధన
డిజిటల్ తరగతి గదిలో వీడియో, ఆడియోలు విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేసేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఆంగ్లంతో పాటు గణితం, భౌతిక, సామాన్య శాస్ర్తాల్లో అందుబాటులో ఉన్న వీడియో , ఆడియోలను ప్రదర్శిస్తూ విద్యాబోధన చేస్తున్నాం. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా వారిలోని పరిజ్ఞానానికి పదును పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించే విధంగా అత్యాధునిక విద్యా బోధనను అందిస్తున్నాం.
- సంతోష్ కుమార్, ఆంగ్ల ఉపాధ్యాయుడు