మద్దూరు, దేవరకద్ర ఇక మునిసిపాలిటీలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:24 PM
నారాయణపేట జిల్లాలోని మద్దూరు, మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మునిసిపాలిటీలు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గె జిట్ విడుదల చేసింది.
గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం
నారాయణపేట/దేవరకద్ర, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లాలోని మద్దూరు, మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మునిసిపాలిటీలు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం గె జిట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో రెనివట్ల గ్రామ పంచాయతీని విలీనం చేశారు. దాంతో నారాయణపేట జిల్లాలో మునిసిపాలిటీలు నాలుగుకు చేరాయి. ఎన్నికల ప్రచారంలో మద్దూర్ రూపురేఖలు మారుస్తామని ఇచ్చిన హామీ మేరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మునిసిపాలిటీని మునిసిపాలిటీ చేశారు. మ ద్దూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఎనిమిదివేల మంది ఓటర్లు ఉండగా, రేనివట్ల పంచాయతీలో నాలుగువేల మంది ఉన్నారు. మునిసిపాలిటీ ఏర్పాటుతో మ ద్దూరు అభివృద్ధి చెందనుంది. దేవరకద్ర మునిసిపాలిటీని 12 వార్డులుగా విభజించారు. దేవరకద్ర, చౌదర్‌పల్లి, మీన్గోనిపల్లి, పెద్ద గోప్లాపూర్, బల్సుపల్లి గ్రామాలను కలిపి మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు.