Share News

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

ABN , Publish Date - Jan 02 , 2025 | 11:28 PM

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని తహ సీల్దార్‌ శ్రీనివాసులు తెలి పారు.

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి
లొద్దిపూర్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న తహసీల్దార్‌ శ్రీనివాసులు

కోస్గి, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని తహ సీల్దార్‌ శ్రీనివాసులు తెలి పారు. గురువారం మండలంలోని లొద్ది పూర్‌, కొత్తపల్లి ప్రాథ మిక పాఠశాలలను, పట్ట ణంలోని బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని, వంటలు చేసే ముందు సరు కులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను ఆరా తీ శారు. అదేవిధంగా మండల విద్యాధికారి శం కర్‌నాయక్‌ పట్టణంలోని మున్నూర్‌వాడ ప్రాథ మిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

నాణ్యత లోపిస్తే చర్యలు: తహసీల్దార్‌

మద్దూర్‌: మఽధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుం టామని తహసీల్దార్‌ మహేష్‌గౌడ్‌ హెచ్చరిం చారు. గురువారం మండలంలోని రెనివట్ల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. భోజనానికి వినియోగించే బియ్యాన్ని పరిశీలించారు. స్టాక్‌ వివరాలపై ఆరా తీశారు. విధిగా మెనూ పాటిం చాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం భోజ నం పర్యవేక్షించాలని చెప్పారు. అలాగే మద్దూ ర్‌లోని గురుకుల పాఠశాలను ఎంపీవో రామన్న తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Updated Date - Jan 02 , 2025 | 11:28 PM