స్థానిక ఎన్నికల్లో బీసీల సత్తా చాటుదాం
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:58 PM
రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జెండా ఎగరేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ పిలుపునిచ్చారు.

- బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్
మక్తల్‌రూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల జెండా ఎగరేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మక్తల్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో బీసీ కుల సంఘాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనరల్ సీట్లలో కూడా బీసీలు నిలబడి గెలవాలని, ప్రజలతో కలిసి పనిచేసి వారి నమ్మకాన్ని పొంది సర్పంచు, వార్డు మెం బర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీలుగా బీసీ నాయకులు గెలువాలని కోరారు. బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని, కచ్చితంగా గెలిచేలా వ్యూహత్మక ఎత్తుగడలు ఫాలో కావాలన్నారు. బీసీలు ఏకమై అభ్యర్థులను గెలిపించేందుకు బీ సీ కులాలు ఐక్యం కావాలని కోరారు. సమావే శంలో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మయ్యముదిరాజ్, నాయకులు వనం తిరుప తయ్యయాదవ్, వజగౌని వెంకటన్న, అక్కల మహదేవన్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ కల్లూరి నాగప్ప, ఎంపీటీసీ మాజీ సభ్యులు మారుతిగౌడ్, సురేష్‌గౌడ్, పద్మరాములు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. అం తకుముందు బీసీ పొలిటికల్ జేఏసీ నారాయణపేట జిల్లా అధ్యక్షునిగా మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఉల్ల లక్ష్మయ్య ముది రాజ్‌ని రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ నియమించారు. అనంతరం శాలువా కప్పి సత్కరించారు.