వివేకానందుడి ఆశయ సాధనకు పాటుపడదాం
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:03 PM
స్వామి వివేకానందుడి ఆశయ సాధనకు పాటు పడుదామని పేట మార్కె ట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రె స్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీంలు పిలుపుని చ్చారు.

- ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
నారాయణపేట, జన వరి 12 (ఆంధ్రజ్యోతి): స్వామి వివేకానందుడి ఆశయ సాధనకు పాటు పడుదామని పేట మార్కె ట్ చైర్మన్ శివారెడ్డి, కాంగ్రె స్ పట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీంలు పిలుపుని చ్చారు. ఆదివారం వివేకానంద జయంతిని పుర స్కరించుకొని మునిసిపల్ పార్కులో వివేకానం ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిం చి, మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి యువతకు పెద్దఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి చొరవతో నియోజక వర్గ యువతకు ఉపాధి అవకాశాలు లభించా యన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గందె చంద్రకాంత్, సరాఫ్ నాగరాజ్, బోయ శరణప్ప, సతీష్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, కోట్ల మధు సూదన్‌రెడ్డి, అలెనూర్ వినోద్, రమేష్, మారుతి, అఖిల్‌రెడ్డి, అనిల్, బస్సప్ప తదితరులున్నారు.
అలాగే ఏబీవీపీ ఆధ్వర్యంలో మునిసిపల్ పా ర్కు వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బీ జేపీ రాష్ట్ర నాయకుడు రంతగ్‌పాండురెడ్డి ప్రా రంభించి, మాట్లాడారు. అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిం చారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా కన్వీనర్ నరేష్, వెంకటేష్, చరణ్‌రెడ్డి, అరున్, అనిల్, రఘువీర్‌యాదవ్, బజరంగ్‌దళ్ నాయకులు శ్ర వణ్, అకాష్, వీరేష్, దినేష్, విజయ్, బాల్‌రాజ్, వీహెచ్‌పీ నాయకులు శివకుమార్, వెంకటేష్, రి తీష్ తదితరులున్నారు. తపస్ ఉపాధ్యాయ సం ఘం నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శేర్ కృష్ణారెడ్డి తదితరులు వివేకానంద విగ్రహానికి పూలమా లలు వేసి నివాళ్లు అర్పించారు.