సేవాలాల్ చూపిన మార్గంలో నడుద్దాం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:30 PM
మీ ఐక్యత ఎన్నటికీ వి చ్చిన్నం కారాదని, మీరంతా సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ కలెక్టరేట్/హన్వాడ/ గండీ డ్/రాజాపూర్/మిడ్జిల్ /మహమ్మ దాబాద్, ఫిబ్ర వరి 15 (ఆంధ్రజ్యోతి) : మీ ఐక్యత ఎన్నటికీ వి చ్చిన్నం కారాదని, మీరంతా సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్ములను భాగస్వాములుగా చూస్తున్నామన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పుర స్కరించుకొని శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గెజిటెడ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్, డైరీని ఆవి ష్కరించారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగుల పాత్ర కీలకం అని, వారు పోరాటాలు చేయకపోతే రాష్ట్రం వచ్చేదా అన్ని గత ప్రభుత్వానికి చుర కలు అంటించారు. ఒక వ్యక్తి కోసమో, ఒక కు టుంబం కోసమో పనిచేయడం స్వేచ్ఛ కాదని, మీ హక్కుల కోసం పోరాటంతో తప్పులేదన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహరెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.