దీక్ష వీడి చర్చకు రండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:59 PM
పెద్దఽధన్వాడలో రిలే నిరాహార దీక్ష శిబిరానికి వె ళ్లి, దీక్షలో కూర్చున్న రైతులు, ఆయా గ్రామాల ప్రజలతో శాంతినగర్ సీఐ టాటాబాబు, రాజోలి తహసీల్దార్ పి.రామ్మోహన్ మాట్లాడారు.

- పెద్దధన్వాడలో రైతులను కోరిన సీఐ, తహసీల్దార్
- గ్రామంలోనే చర్చించాలని పట్టుబట్టిన రైతులు
రాజోలి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెద్దధన్వాడ శివారులో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విష యమై దీక్ష వీడాలని, జిల్లా అధికారుల సమ క్షంలో గద్వాలలో ఫ్యాక్టరీ యాజమాన్యంతో మా ట్లాడాలని అధికారులు కోరారు. గురువారం పెద్దఽధన్వాడలో రిలే నిరాహార దీక్ష శిబిరానికి వె ళ్లి, దీక్షలో కూర్చున్న రైతులు, ఆయా గ్రామాల ప్రజలతో శాంతినగర్ సీఐ టాటాబాబు, రాజోలి తహసీల్దార్ పి.రామ్మోహన్ మాట్లాడారు. దీనికి ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు స్పందిస్తూ ఫ్యాక్టరీ నిర్మాణంపై చర్చించాలనుకుంటే ప్రజల సమక్షంలోనే చర్చించాలని, 13 గ్రామాల ప్రజలు, తాము జిల్లా కేంద్రానికి రాలేమని తేల్చి చెప్పారు. దీంతో అధికారులు వెనుదిరిగి వెళ్లారు. కాగా రైతుల దీక్షలు గురువారం 8వ రోజుకు చేరాయి.