Share News

అభయహస్తం ప్రకటనపై నేతన్నల హర్షం

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:17 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత కార్మి కులకు అభయహస్తం పథకం ప్రకటించడంతో నేతన్నల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అయ్యాయి.

అభయహస్తం ప్రకటనపై నేతన్నల హర్షం
పేటలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నేతన్నలు

- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం

నారాయణపేట/కోస్గి/ధన్వాడ, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత కార్మి కులకు అభయహస్తం పథకం ప్రకటించడంతో నేతన్నల్లో ఆనందోత్సవాలు వ్యక్తం అయ్యాయి. నారాయణపేటలో చేనేత కార్మికులు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ హ్యాండ్‌ల్యూమ్‌ సొసైటీ నుంచి చేనేత కార్మికు లు అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పేట మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత సంక్షేమం కో సం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో చేనే త కార్మిక సంఘం నాయకులు సతీష్‌బత్తుల్‌, జ్ఞాన్‌దేవ్‌ గనప, ఆంజనేయులు కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సలీం, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శరణప్ప, బాల్‌రెడ్డి తదితరులున్నారు.

అదేవిధంగా, కోస్గి మండల చేనేత కార్మికులు శనివారం స్థానిక ఉన్ని పారిశ్రామిక కేంద్రం నుంచి శివాజీ కూడలి వరకు ర్యాలీ నిర్వహించా రు. కౌన్సిలర్‌ కస్తూరమ్మ, కాంగ్రెస్‌ నాయకుడు బాల్‌రాజ్‌, సంఘం నాయకులు నారాయణ, చంద్రమౌళి, శ్రీనివాస్‌, అంజిలయ్య ఉన్నారు.

ధన్వాడలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీ ఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీ సీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి ల చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం నిర్వ హించారు.

Updated Date - Jan 11 , 2025 | 11:17 PM