నేటి నుంచి లక్ష్మీ నారసింహస్వామి ఉత్సవాలు
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:38 PM
మండల పరిధిలోని సంగినేనిపల్లి సమీపంలోని గుట్టలో రాతిశిల గుహలో వెలిసిన లక్ష్మీ నారసిం హస్వామి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి.

వీపనగండ్ల, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని సంగినేనిపల్లి సమీపంలోని గుట్టలో రాతిశిల గుహలో వెలిసిన లక్ష్మీ నారసిం హస్వామి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవా రం ఆలయ శుద్ధి, స్వామి వారి అలంకరణ, మం గళవారం హోమం, అభిషేకం, కుంకుమార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహి స్తారు. అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఉత్సవాలకు చుట్టు పక్కల మండలాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. చుట్టు పక్కల గ్రామాల రై తులు ఎద్దుల బండ్లను అందంగా అలంకరించు కొని ఆలయానికి వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూ జలు చేస్తారు. తమ పంట పొలాల్లో కొత్తగా ప ండిన ధాన్యంతో నైవేద్యం తయారు చేసి స్వామి వారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఎన్నో ఏళ్లుగా రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు బీటీ రోడ్డు వేయడంతో ఆ సమస్య ఈ ఏడాది తీరింది.
రెండు దశాబ్దాలుగా అన్నదానం..
సంగినేనిపల్లికి చెందిన మత్స్యకారులు రెండు దశాబ్దాల కిందటి నుంచి అన్నదాన కార్యక్ర మం నిర్వహిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చే భ క్తులకు తాగునీటి వసతి కల్పిస్తున్నారు. మత్స్య కారులు చందాలు వేసుకొని అన్నదాన కార్య క్రమ నిర్వహణకు సిద్ధమవుతున్నారు.