కోటకొండ గ్రామాన్ని మండలం చేయాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:50 PM
అన్ని అర్హతలున్న కోటకొండ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హన్మేష్, జిల్లా కార్యదర్శి రాము, డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు.

- సీపీఐఎంఎల్ మాస్‌లైన్ ఆధ్వర్యంలో ధర్నా
నారాయణపేట రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : అన్ని అర్హతలున్న కోటకొండ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని సీపీఐఎంఎల్ మాస్‌లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హన్మేష్, జిల్లా కార్యదర్శి రాము, డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మూడు రోజుల ధర్నాను ప్రారంభించి వారు ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు కోటకొండ నుంచి జిల్లా కేంద్రానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. పశువైద్యశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రితో పాటు బ్యాంకు తదితర వసతులు ఉన్నాయన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ధర్నాకు టీడీపీ నాయకుడు ఓంప్రకాశ్, యాబన్న, భీమన్న మద్దతు తెలిపారు.