Share News

హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలి

ABN , Publish Date - Mar 08 , 2025 | 11:01 PM

హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహమూర్తి, జగదీశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాంబాబులు పిలుపునిచ్చారు.

హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలి
మాట్లాడుతున్న వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహమూర్తి

- వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహమూర్తి

నారాయణపేట, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని వీహెచ్‌పీ ప్రాంత అధ్యక్షుడు నర్సింహమూర్తి, జగదీశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రాంబాబులు పిలుపునిచ్చారు. శనివారం నారా యణపేట శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో జిల్లా, పేట పట్టణ పూర్తి స్థాయి కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గోసంరక్షణ కోసం పాటుపడా లన్నారు. హిందువులపై దాడులకు పాల్పడే సంఘవిద్రోహులను పారదోలాలన్నారు. జిల్లాలో హిందూ జాగృతి హిందూ ధార్మిక కార్యక్రమాల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ నూతన అధ్యక్షుడిగా డాక్టర్‌ రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా కన్న శివకుమార్‌, విభాగ కార్యదర్శిగా నరేందర్‌, సహాయ కార్యదర్శిగా లక్ష్మీనారాయణ ఉన్నారు. నారాయణ పేట వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షుడిగా మురళీ బట్టడ్‌, ప్రధాన కార్యదర్శిగా కండుదాస్‌ ప్రవీన్‌, బజరంగ్‌దళ్‌ జిల్లా అధ్యక్షుడిగా వడ్ల శ్రావన్‌, సహాయ ప్రయోజక్‌గా భీమేష్‌తో పాటు మరి కొంత మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో దుర్గావాణి మాతృమండలి సభ్యులు పవిత్ర, లలితా, భాస్కర్‌, వందన, వైష్ణవి, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు తది తరులున్నారు.

Updated Date - Mar 08 , 2025 | 11:01 PM