కనుల పండువగా కల్యాణం
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:12 PM
మండలంలోని ఎక్లాస్‌పూర్ తిమ్మప్ప బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీనివాస కల్యాణం ఆలయ అర్చ కులు జరిపించారు.

నారాయణపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఎక్లాస్‌పూర్ తిమ్మప్ప బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీనివాస కల్యాణం ఆలయ అర్చ కులు జరిపించారు. ఉత్సవాల్లో భాగంగా ప్ర త్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి.
మరికల్: పౌర్ణమిని పురస్కరించుకుని బు ధవారం మండలంలోని ఎక్లాస్‌పూర్ స్టేజీ వద్ద వెలసిన లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం నిర్వ హించారు. స్వామి వారికి ఇష్టమైన నైవేద్యం, దాసంగాలను సమర్పించారు.
జల్ది బిందే మహోత్సవం
మండలంలోని పల్లెగడ్డ శివారులో పౌర్ణమి ని పురస్కరించుకుని కొండపై వెలసిన తిరు మలేశ్వర స్వామి (వేంకటేశ్వరస్వామి) జల్ది బిందె మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తీర్థప్రసాదం, అన్నదానం నిర్వహించారు.
శివపార్వతుల కల్యాణం
ధన్వాడ: మండల కేంద్రంలోని త్రిలోకేశ్వర శివాలయంలో బుధవారం శివపార్వతుల క ల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో కలశం ఊరేగిం చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిదంగా మహా పడిపూజ నిర్వహించారు.
లక్ష్మీవేంకటేశ్వర కల్యాణ మహోత్సవం
మద్దూర్: మండలంలోని నందిపాడ్‌లో లక్ష్మీవేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని బుధ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సలీం, శాసం రామ కృష్ణ, విజయ భాస్కర్‌రెడ్డి, శేఖర్, నరేష్ తది తరులు పాల్గొని పూజలు చేశారు.