Share News

కనులపండువగా కల్యాణ మహోత్సవం

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:38 PM

వనపర్తి జిల్లా, ఖిల్లాఘణ పురం మండలంలోని గట్టుకాడిపల్లిలో వేంక టేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ వంగా కొనసాగుతున్నాయి.

కనులపండువగా కల్యాణ మహోత్సవం
పుష్పయాగం అనంతరం స్వామి, అమ్మవార్లకు హారతి ఇస్తున్న అర్చకులు

- ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు

- వెంకటేశ్వర స్వామికి పట్టువస్త్రాల సమర్పణ

ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా, ఖిల్లాఘణ పురం మండలంలోని గట్టుకాడిపల్లిలో వేంక టేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ వంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కల్యాణా న్ని కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతు లు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలం బ్రాలు సమర్పించారు. అంతకు ముందు కల్పవృక్ష వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. అనంతరం దేవతా మూర్తుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కల్యాణ మండపానికి తీసుకువెళ్లారు. పట్టువస్ర్తాలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. మాం గళ్యధారణ అనంతరం పూలదండల మార్పి డి సమయంలో వేద పండితుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పురోహితులు స్వామి, అమ్మవార్లకు తలం బ్రాలు పోసి, భక్తులతో కలిసి పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులను ఆలయ కమిటీ నిర్వాహకులు పట్టువస్త్రాలతో సత్కరించి, ఆశీర్వదించారు. ఆ తర్వాత హన్మంతు సేవ నిర్వహించారు.

Updated Date - Feb 10 , 2025 | 11:38 PM