బాధితులకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Jan 30 , 2025 | 11:59 PM
పోలీసులు విధి నిర్వహ ణలో అంకితభావంతో పని చేయాలని, పోలీసులకు ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని బాధి తులకు న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.

వనపర్తి క్రైం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : పోలీసులు విధి నిర్వహ ణలో అంకితభావంతో పని చేయాలని, పోలీసులకు ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొని బాధి తులకు న్యాయం చేయాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వనపర్తి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లతో గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రమశిక్షణ తదితర అంశా ల గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. బాధతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలని సూచించారు. పోలీస్ శాఖ అంటేనే క్రమశిక్షణకు మారు పేరని, అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ తమకు కేటా యించిన విధులను సక్రమంగా నిర్వహించాలని, వృత్తిపరమైన జీవి తంలో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ వనపర్తి జిల్లాకు, తెలంగాణ పోలీస్‌కు మంచి పేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శివకుమార్, జిల్లాలోని ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.