డీట్ యాప్‌లో ఉద్యోగావకాశాలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:27 PM
ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్ అన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, జాబ్‌మేళా వంటి సమాచారం
జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్
గద్వాలన్యూటౌన్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనలో నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రామలింగేశ్వర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తెలంగాణ కమిటీ డి జిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు నిరంతర ఉపాధి అవకాశాలను కల్పిం చేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యం లో డీట్ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. వినూత్న ఏ10 ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ యువత నైపుణ్యాలను గుర్తించి, అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్‌రంగ ఉద్యోగాలను సూచిస్తుందని తెలిపారు. డీఈఈటీ ద్వా రా ఉద్యోగార్థులకు రెజ్యూమ్ తయారీ మార్గదర్శనం, స్థానం ఆధారంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇంటర్నెషిప్‌్క్ష అప్రెంటిస్‌షిప్ అవకాశాల హైలై ట్, జాబ్‌మేళాల నిర్వహణ వంటి సేవలు అందిస్తుందన్నారు. వెబ్‌సైట్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ అప్లికేషన్‌ల ద్వారా ఎన్‌రోల్‌మెంట్, జాబ్‌పోస్టింగ్‌లు, జాబ్‌అలర్ట్‌లు, హెచ్‌ఆర్‌లతో చాట్‌లు, ఇం టర్వ్యూలు వంటి ఫీచర్లను ఉపయోగించుకోవచ్చన్నారు. ఐ.టీ.ఐ. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరిం గ్, ఫార్మసీ, ఇతర ఉపాధి కోర్సులు చదివిన వి ద్యార్థులు డీఈఈటీలో రిజిస్ర్టేషన్ చేసుకోవ డం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే అవకాశాలు మెరుగవుతాయన్నారు. సమావేశంలో పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ రామ్మోహ న్, ఐటీఐ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డాక్టర్ ప్రియాంక, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మహేష్‌కుమార్, అడిషనల్ డీఆర్‌డీవో నర్సింహులు ఉన్నారు.