Share News

పైరవీలకు తావు లేకుండా పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:37 PM

పోలీస్‌ స్టేషన్లలో పైరవీలకు తావు లేకుండా ఫి ర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని ఎ స్పీ రావుల గిరిధర్‌ అన్నారు.

పైరవీలకు తావు లేకుండా పరిష్కరించాలి

వనపర్తి క్రైమ్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : పోలీస్‌ స్టేషన్లలో పైరవీలకు తావు లేకుండా ఫి ర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని ఎ స్పీ రావుల గిరిధర్‌ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను ఆయా మండలా ల ఎస్‌ఐలు సత్వరమే పరిష్కరించి ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలన్నారు. చట్ట ప్రకా రం పోలీసులు తమ విధులు తాను నిర్వహించి నప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం ఏర్పడు తుందన్నారు. మొత్తం ప్రజావాణికి 5 ఫిర్యాదు లు వచ్చినట్లు తెలిపారు.

Updated Date - Feb 24 , 2025 | 11:37 PM