Share News

ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం

ABN , Publish Date - Mar 08 , 2025 | 10:56 PM

ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యమని, ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి మహమ్మద్‌ అబ్దుల్‌రఫీ కోరారు.

ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యం
లోక్‌ అదాలత్‌లో మాట్లాడుతున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి మహమ్మద్‌ అబ్దుల్‌రఫీ

- జిల్లా ప్రధాన న్యాయాధికారి మహమ్మద్‌ అబ్దుల్‌రఫీ

నారాయణపేటటౌన్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవ చేయడం మన కర్తవ్యమని, ప్రజలు తమకు అండగా నిలిచి సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి మహమ్మద్‌ అబ్దుల్‌రఫీ కోరారు. శనివారం లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి వింద్యనాయక్‌, జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి మహమ్మద్‌ ఉమర్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధి కారి జకియాసుల్తానా, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ సురేష్‌కుమార్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆకుల బాలప్ప, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కె.లక్ష్మిపతిగౌడ్‌, నాగేశ్వరి, ఇతర న్యాయవాదులు కలిసి లోక్‌ అదాలత్‌కు వచ్చిన వివిధ రకాల కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించారు. లోక్‌ అదాలత్‌లో నారాయణపేట జిల్లా కోర్టు పరిధిలో 9,825 కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించారు. జిల్లాలో 14 పోలీస్‌స్టేషన్లతో పాటు రెండు ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఉ న్న కేసులకు న్యాయవాదులు సహకరించి పరి ష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా రాజీ అయిన వ్యక్తులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మొక్కను అందజేసి, అభినందించారు. మొత్తం కేసుల పరిష్కారానికి గాను రూ.24,08,020 ఆదాయం ప్రభుత్వానికి సమకూరిందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సీని యర్‌ సివిల్‌ న్యాయాధికారి, డీఎల్‌ఎస్‌ఏ కార్య దర్శి వింద్యనాయక్‌ మాట్లాడుతూ ఇరువురు అ వగాహనతో కేసులను రాజీ చేసుకుని సంతోషం గా ఉండాలని సూచించారు. జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి మహమ్మద్‌ ఉమర్‌ మాట్లాడు తూ లోక్‌ అదాలత్‌ మంచి అవకాశమని, లోక్‌ అదాలత్‌లో చిన్నచిన్న కేసులను క్షమించి రాజీ కావడం వల్ల ఇరువురికి సంతోషంగా ఉంటుంద న్నారు. సివిల్‌, తదితర కేసుల్లో ఒకరికొకరు రా జీ కావడం వల్ల కేసులు పరిష్కారం అవుతా యని, ఇద్దరూ గెలుస్తారని అన్నారు. పీపీ బాల ప్ప మాట్లాడుతూ ప్రతీ రెండు నెలలకోసారి జా తీయ లోక్‌ అదాలత్‌ జరుగుతుందన్నారు. ఆర్థిక స్థోమత లేనివారి కేసులను ఉచితంగా వాదించ డానికి న్యాయవాదులను నియమిస్తుందని డిఫె న్స్‌ కౌన్సిల్‌ లక్ష్మిపతిగౌడ్‌ తెలిపారు. కార్యక్ర మంలో న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2025 | 10:57 PM