Share News

జ్యోతిబాఫూలే విగ్రహాన్ని అవమానించడం సరికాదు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:32 PM

పట్టణంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాఫూలే వి గ్రహానికి అవమానం జరిగిందంటూ బీసీ సం ఘాల నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగా రు.

జ్యోతిబాఫూలే విగ్రహాన్ని అవమానించడం సరికాదు
ఆందోళనకు దిగిన వారిని సముదాయిస్తున్న ఎస్‌ఐ చంద్రమోహన్‌

జడ్చర్ల, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాఫూలే వి గ్రహానికి అవమానం జరిగిందంటూ బీసీ సం ఘాల నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగా రు. 167వ జాతీయ రహదారి నిర్మాణంలో భా గంగా అంబేద్కర్‌ చౌరస్తా వెడల్పు చేపట్టే పను లలో భాగంగా జ్యోతిబాఫూలే విగ్రహాన్ని త హసీల్దార్‌ కార్యాలయ ప్రధాన ద్వారం పక్కన ఉంచారు. మహనీయుడి విగ్రహాన్ని కార్యా లయం బయట అగౌరవ పరిచేవిధంగా ఉం చారంటూ వారంతా ఆరోపించారు. ఆం దోళన చేపట్టిన వారిని ఎస్‌ఐ చంద్రమోహన్‌ సము దాయించే ప్రయత్నం చేశారు. వారితో త హసీల్దార్‌ బ్రహ్మంగౌడ్‌ మాట్లాడి, కార్యాలయ ఆవరణలో విగ్రహాన్ని ఉంచుతామని వెల్లడించారు.

Updated Date - Jan 17 , 2025 | 11:32 PM