జాగిలాల బృందంతో అంతర్గత భద్రత పటిష్టం
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:03 PM
తొమ్మిది నెలల పాటు మొయినాబాద్‌లో కఠోర శిక్షణ పొంది నారాయణపేట జిల్లాకు వచ్చిన నూతన జాగిలం లక్కీ బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది.

- ఎస్పీ యోగేష్‌గౌతమ్
- నారాయణపేట జిల్లాకు వచ్చిన నూతన జాగిలం లక్కీ
- డాగ్ హ్యాండర్‌కు గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందజేసిన పోలీస్ బాస్
నారాయణపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తొమ్మిది నెలల పాటు మొయినాబాద్‌లో కఠోర శిక్షణ పొంది నారాయణపేట జిల్లాకు వచ్చిన నూతన జాగిలం లక్కీ బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. లక్కీని డాగ్ హ్యాండర్ పీసీ భగవంతు తీసుకొచ్చి ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ, త్రిపుర, బీహార్, గోవా రాష్ట్రాలకు చెందిన 32 డాగ్స్ పేలుడు పదార్థాలు గుర్తించడంలో పోటీ పడగా అందులో పేట జిల్లా డాగ్ లక్కీకి గోల్డ్ మెడల్ వచ్చిందని ఆర్‌ఐ నర్సింహ ఎస్పీకి వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా అంతర్గత భద్రతలో కీలకపాత్ర పోషించనున్న జాగిలాల బృందానికి మరో జాగిలం లక్కీ రావడం అదనపు బలంగా సంతోషకరం అన్నారు. ఈ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ జాతికి సంబంధించినదని తెలిపారు. డాగ్ ఉండడానికి అన్ని సదుపాయాలు కల్పించాలని, ప్రతీరోజు ఎక్సర్ సైజ్, వాటికి కావల్సిన డైట్ అందించాలన్నారు. జిల్లా పరిధిలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ బృందం ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.