Share News

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:25 PM

ఇంటర్‌ జనరల్‌, వృత్తి విద్య ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభం

- గద్వాల జిల్లా వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాలు

గద్వాల సర్కిల్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ జనరల్‌, వృత్తి విద్య ప్రయోగ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 29పరీక్ష కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు భాగాలుగా మొదటి విడత ప్రయోగ పరీక్షలు సజావుగా జరిగినట్లు డీఐఈవో, పరీక్షల జిల్లా కన్వీనర్‌ హృదదయరాజు తె లిపారు. ఉదయం జరిగిన ప్రయోగ పరీక్షలకు జనరల్‌ విభాగంలో 395మంది విద్యార్థులకు 95శాతంతో 377మంది విద్యార్థులు హాజరుకాగా 18మంది గైర్హాజరయ్యారని తెలిపారు. వృత్తివిద్యా విభాగంలో 510మంది విద్యార్థులకు 90శాతంతో 459 మంది హాజరుకాగా 51మంది హాజరుకాలేదని పేర్కొన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు జనరల్‌ విభాగంలో 213 మంది విద్యార్థులకు 97శాతంతో 207మంది హాజరుకాగా 6 మంది గైర్హాజరయ్యారని, వృత్తి విద్యావిభాగంలో 460మంది విద్యార్థులకు గాను 96శాతంతో 442 హాజరు కాగా 18మంది విద్యార్థులకు హాజరుకాలేదన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని పరీక్షల చీప్‌ సూపరింటెండెంట్లకు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లకు సూచించారు.

Updated Date - Feb 03 , 2025 | 11:25 PM