ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:31 PM
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 36, నారాయణపేట జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో 292 మంది..
నారాయణపేట జిల్లాలో 140 మంది గైర్హాజరు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ నారాయణపేట, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 36, నారాయణపేట జిల్లాలో 16 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌లో 97.44 హాజరు శాతం నమోదైంది. కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచే సందడి నెలకొంది. అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సౌకర్యం కల్పించారు. కేంద్రాలను డీఐఈవో, స్క్వాడ్ బృందాలు పరిశీలించారు.
97.44 శాతం మంది విద్యార్థులు
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 11,409 మంది హాజరు కావల్సి ఉండగా.. 11,117 మంది విద్యార్థులు హాజరయ్యారు. 292 మంది గైర్హాజరు అయ్యారు. జనరల్ విద్యార్థులు 9,323 మందికి గాను 9124 మంది హాజరుకాగా, 199 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,086 మందికీ గాను 1,993 మంది హాజరు కాగా 93 మంది గైర్హాజరు అయ్యారు.
నారాయణపేటలో..
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4,476 మంది విద్యార్థులకు గాను 4,336 హాజరు కాగా.. మంది 140 మంది గైర్హాజరు అయ్యారు. అందులో జనరల్ విద్యార్థులు 3,888 మందికి గాను 3,767 మంది హాజరు కాగా.. 121 మంది, ఒకేషనల్ విద్యార్థులు 588 మందికి గాను 569 మంది హాజరు కాగా, 19 మంది గైర్హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ బేన్‌షాలం, జిల్లా నోడల్ అఽధికారి సుదర్శన్‌రావు, డీఎస్సీ లింగయ్య పర్యవేక్షించారు.