ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:04 PM
జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి.

- జిల్లాలోని 16 కేంద్రాల్లో పరీక్షలు రాసిన 4,336 మంది విద్యార్థులు
- ఫస్ట్ ఇయర్‌లో 140 మంది విద్యార్థుల గైర్హాజరు
- అదనపు కలెక్టర్, డీఎస్పీల పరిశీలన
- కేంద్రాల వద్ద 144 సెక్షన్
నారాయణపేట, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 మండలాల్లో 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇంటర్ ఫస్టియర్‌లో 4,476 మంది విద్యార్థులకు గాను 4,336 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 140 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 3,888 మందికి గాను 3,767 మంది పరీక్షలు రాయగా 121 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్‌లో 588 మందికి గాను 569 మంది పరీక్షలు రాయగా 19 మంది గైర్హాజరయ్యారు. నారాయణపేట శ్రీసాయి జూనియర్ కళాశాలను అదనపు రెవెన్యూ కలెక్టర్ బెన్‌షాలం, జిల్లా నోడల్ అఽధికారి సుదర్శన్‌రావు, డీఎస్పీ లింగయ్యలు తనిఖీ చేశారు. అలాగే ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని డీఎస్పీ లింగయ్య తనిఖీ చేసి, మాట్లాడారు. దామరగిద్ద, మద్దూర్, కోస్గిలలోని పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్స్ బృందం తనిఖీ చేసింది. డీఈసీ సభ్యులు ఊట్కూర్, మక్తల్, మాగనూర్ పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సిట్టింగ్ స్క్వాడ్స్ బృందం మక్తల్‌లోని రెండు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. పరీక్షా కేం ద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు, సీ సీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగాయి. అరగంట ముందే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు.