Share News

సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:42 PM

కొడంగల్‌ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి అన్నారు.

సమగ్రాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
మద్దూర్‌లో పీఏసీఎస్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న తిరుపతిరెడ్డి

- కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి

- మద్దూర్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

మద్దూర్‌/కొత్తపల్లి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కొడంగల్‌ నియోజకవర్గ సమగ్రా భివృద్ధే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరు పతిరెడ్డి అన్నారు. మద్దూర్‌లో నిర్మించిన బాలిక నూతన భవనాన్ని ప్రారంభించడంతో పాటు, రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పీఏసీ ఎస్‌ భవనానికి కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియో జకవర్గంలోని అన్ని మండలాల్లో విద్య, వైద్యం తదితర సదుపాయాల కల్పన, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం వందల కోట్లు మంజూరు చేస్తోందన్నారు. ఈ ఐదేళ్లలో కొడంగల్‌ ఆదర్శ నియోజకవర్గంగా మారడం ఖాయమన్నారు. కో స్గి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహ, తహసీల్దార్‌ మహేష్‌గౌడ్‌, ఎంపీడీవో నర్సింహారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యు డు రఘుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ సంజీవ్‌, ఎంపీ టీసీ మాజీ సభ్యుడు వీరేష్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ హన్మిరెడ్డి, నాయకులు ఉన్నారు.

కొత్తపల్లిలో రూ.8.80 కోట్లతో నిర్మించనున్న మండల సమీకృత భవన నిర్మాణాలకు గురువా రం కాంగ్రెస్‌ పార్టీ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఏ.తిరుపతిరెడ్డి కాడా అధికారి వెంకట్‌ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. అంతకు ముందు భూనీడు గ్రామంలో జూనియర్‌ కళాశా లను మంజూరు చేశారు. తహసీల్దార్‌ జయరా ములు, ఎంపీడీవో కృష్ణారావు, డీఈ విలోక్‌, నారాయణపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కోట్ల మహేందర్‌రెడ్డి, నాయకులు ఉ న్నారు.

Updated Date - Feb 13 , 2025 | 11:42 PM