Share News

ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:39 PM

డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద త్వరగా మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు.

ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి

దౌదర్‌పల్లి, గోనుపాడు వద్ద డబుల్‌ బెడ్రూం ఇళ్లను పరిశీలించిన కలెక్టర్‌

సుందరీకరణ, పచ్చదనం పెంపు చర్యలు చేపట్టాలి

గద్వాల, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ బెడ్రూం ఇళ్ల వద్ద త్వరగా మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు. సోమవారం దౌదర్‌పల్లి దర్గా వద్ద నిర్మించిన 1,275 ఇళ్లను, మండ ల పరిఽధిలోని గోనుపాడు వద్ద నిర్మించిన 25 ఇళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. దౌదర్‌పల్లి ఇళ్ల పరిస్థితిని పరిశీలించి మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, మురికి కాలువలు, సెప్టిక్‌ ట్యాంక్‌ల నిర్మాణం, విద్యుత్‌ సరఫరా, పారిశుధ్యం వంటివి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఖాళీ స్థలాల్లో సుందరీకరణ, పచ్చదనం పెంపు వంటివి పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించడంలో ఆలస్యం అయ్యిందని, పనులు త్వరగా చేయాలని సూ చించారు. గోనుపాడు వద్ద కూడా ముళ్ల పొదల ను తొలగించి సౌకర్యాలను మెరుగుపర్చాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, తహసీల్దార్‌ మల్లికార్జున్‌, మునిసిపల్‌ కమిషనర్‌ దశరథ్‌, విద్యుత్‌శాఖ లక్ష్మీనాయక్‌, పీఆర్‌ ఈఈ రాంచందర్‌, మిషన్‌ భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:39 PM