Share News

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:10 PM

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు ఆసుపత్రిలో ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట పీవోడబ్ల్యూ నాయకులు ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలి
డీఎంహెచ్‌వో డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మికి వినతిపత్రం అందిస్తున్న మహిళలు, పీవోడబ్ల్యూ నాయకులు

నారాయణపేట టౌన్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేటు ఆసుపత్రిలో ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరుతూ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట పీవోడబ్ల్యూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల కు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రై వేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపడడం లేదన్నారు. కాన్పులు సరైన సమయంలో జరగక గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. అనంతరం డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందించారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, ప్రతాప్‌, యాదగిరి, రాము, అంజప్ప, మహాదేవి తదితరులున్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:10 PM