జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:33 PM
జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు లొట్టి శ్రీను డిమాండ్ చేశారు.

నారాయణపేట, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు లొట్టి శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర యూనియన్ పిలుపులో భాగంగా నారాయణపేట కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో మాధవ్, యాదయ్య, నారా యణ, నర్సింలు, లింగం, సోఫీ, మోహన్‌రాజ్, శివ, ఇమామ్, బాల్‌రాజ్, నరసింహ, ఆనంద్, సంతోష్ తదితరులున్నారు.