Share News

ఆకట్టుకున్న శ్రీకృష్ణాంజనేయ పౌరాణిక నాటకం

ABN , Publish Date - Jan 04 , 2025 | 11:27 PM

మునిసిపాలిటీ కేంద్రంలోని పదో వార్డులో శనివారం రాత్రి వరకవుల నరహరి రాజు సంగీత నాటక జనత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వ హించిన శ్రీకృష్ణాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకం చూపరులను ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న శ్రీకృష్ణాంజనేయ పౌరాణిక నాటకం
పౌరాణిక నాటకంలోని ఓ సన్నివేశం

భూత్పూర్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీ కేంద్రంలోని పదో వార్డులో శనివారం రాత్రి వరకవుల నరహరి రాజు సంగీత నాటక జనత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వ హించిన శ్రీకృష్ణాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకం చూపరులను ఆకట్టుకుంది. శ్రీకృష్ణడిగా ప్రముఖ పౌరణిక రంగస్థల నటుడు దుర్వాస రాజు సత్యభామగా రాధిక, రుక్మిణిగా ఇందిర జీవకళను ఉట్టిపడేలా నటించారు. ఆంజనేయు డిగా సంజీవయాదవ్‌, నారధుడిగా తిరుపతయ్య, బాలరాముడిగా హన్మంతు, గరుత్ముడిగా కోళ్ల శంకర్‌, ప్రతిహరిగా రాఘవేందర్‌, కుచేలు డిగా రాములు వారి వారి పాత్రలో విశేషంగా నటించారు. హర్మోనిష్టుగా నరహరి రాజు పాత్ర దారులకు ఎంతో సహాయాన్ని అందించారు. బీ ఆర్‌ఎస్‌ నాయకుడు మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ అంతరించి పోతున్న పౌరణిక నాటక కళ ను జీవం పోస్తున్న జనత సేవా సమితి కళాకా రులను అభినందించారు. బీజేపీ రాష్ట్ర కార్యవ ర్గ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2025 | 11:27 PM