అక్రమంగా వేసిన గుడిసెలు తొలగించాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:26 PM
ప్రభుత్వ స్ధలంలో అక్రమంగా గుడిసెలు వేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్ధలంలో పార్కులను ఏర్పాటు చేయాలని కోరు తూ మంగళవారం ఐడీఎస్‌ఎంటీ కాలనీ సభ్యు లు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.

- కలెక్టరేట్ ఎదుట ఐడీఎస్‌ఎంటీ కాలనీ వాసుల ధర్నా
గద్వాల న్యూటౌన్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్ధలంలో అక్రమంగా గుడిసెలు వేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ స్ధలంలో పార్కులను ఏర్పాటు చేయాలని కోరు తూ మంగళవారం ఐడీఎస్‌ఎంటీ కాలనీ సభ్యు లు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐడీఎస్‌ఎంటి కాలనీ అధ్యక్షుడు నర్సింహులు యాదవ్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఐడీఎస్‌ఎంటి కాలనీలో ఎల్.పి. నెం. 50/9. సర్వే నెంబర్ 773,774, 775, 784,784,785, 786 సర్వే నెంబర్‌లలో ఉన్న పదిశాతం ప్రభుత్వ స్ధలంలో కొంద రు నేతలు అక్రమంగా బినామీ పేర్లతో గుడిసెలు వేశారన్నారు. వాస్తవానికి పదిశాతం ప్రభుత్వ స్ధలంలో పార్కులను ఏర్పాటు చేసి ఆట స్థలాలకు కేటాయించడం జరుగుతుందని, కాని కొందరు అక్ర మంగా గుడిసెలు వేయడం జరిగిందన్నారు. ఈ గుడిసెల్లో కొన్ని నిరుపయోగంగా ఉన్నాయని, అందులో జంతువులు మరణించి దుర్వాసన వెదజల్లడంతో పాటు విష సర్పాలు కూడా వస్తున్నాయన్నారు. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురౌతున్నారని. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి అక్రమంగా వెలిసిన గుడిసెలను తొలగించి అక్కడ పార్కును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఐడీఎస్‌ఎంటీ కాలనీ జనరల్ సెక్రటరీ టి.చెన్నకేశవులు ఉపాధ్యక్షుడు హనుమంతు, తెలుగు నర్సింహులు, సభ్యుడు సురేందర్ యాద వ్ తదితరులు ఉన్నారు.