Share News

బంజారాల ఇలవేల్పు సంత్‌ సేవాలాల్‌

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:11 PM

బంజారాల ఆరాధ్య దైవం, ఇలవేల్పు సేవాలాల్‌ మహారాజ్‌ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

బంజారాల ఇలవేల్పు సంత్‌ సేవాలాల్‌
మరికల్‌ మండలం బుడ్డగాని తండాలో మాట్లాడుతున్న మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- పేట, మక్తల్‌ ఎమ్మెల్యేలు చిట్టెం పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి

- జిల్లాలో ఘనంగా జయంతి కార్యక్రమాలు

- చిత్రపటాలకు పూలమాలలతో ఘన నివాళి

- గిరిజనుల వేషధారణలో మహిళలతో మమేకమైన పర్ణికారెడ్డి

నారాయణపేట/దామరగిద్ద/మరికల్‌/నారాయణపేటరూరల్‌/కొత్తపల్లి/మద్దూర్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): బంజారాల ఆరాధ్య దైవం, ఇలవేల్పు సేవాలాల్‌ మహారాజ్‌ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. శనివారం నారాయణపేటలో సేవాలాల్‌ 286వ జయంతిని పురస్కరించుకొని నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బారంబావి వద్ద ఆర్డీవో రాంచందర్‌ పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గిరిజన మహిళల వేషధారణ లతో మమేకమై నృత్యాలు చేస్తూ గిరిజనుల్లో రె ట్టింపు ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సేవాలాల్‌ మహారాజ్‌ బోధనలు సమాజాన్ని సన్మార్గంలో నడిపించాయన్నారు. వారి బోధనలు గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. పండుగ వాతావరణం మధ్య వేడుకలు జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం బంజారుల అభివృద్ధికి కట్టు బడి ఉందన్నారు. గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాం గ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

అదేవిధంగా, దామరగిద్ద మండలం వత్తు గుండ్ల తండాలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి హాజరై సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘీక సంస్కరణలు తీసుకురావడంలో, మూఢనమ్మకాలు, కాలం చెల్లిన ఆచారాలను నిర్మూలించడంలో సేవాలాల్‌ కీలక పాత్ర పోషించారన్నారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్యే నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సర్పంచు కమలిబాయి, మోహన్‌నాయక్‌ తది తరులున్నారు.

మరికల్‌ మండలం బుడ్డగానితండాలో నిర్వహించిన సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకల్లో మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సూర్యచం ద్ర ఫౌండేషన్‌ అధినేత సూర్యమోహన్‌రెడ్డి హాజ రయ్యారు. మండల కేంద్రంలో బంజారాలు ర్యాలీగా వచ్చి ఇందిరాగాంధీ చౌరస్తాలో సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి, నివాళ్లు అర్పించారు. అనంతరం వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గోర్‌ బంజారా జాతిని చైతన్యపరుస్తూ వారిని సన్మార్గంలో నడిపించేం దుకు కృషి చేసిన మహానీయుడు సేవాలాల్‌ మ హారాజ్‌ అన్నారు. కార్యక్రమంలో జయరామ్‌నాయక్‌, బీసం చెన్నయ్యసాగర్‌, రామకృష్ణారెడ్డి, రాఘవేందర్‌, సత్యన్న, వివిధ గ్రామాల గిరిజనులు పాల్గొన్నారు.

నారాయణపేట మండలం పేరపళ్ల మీది తండా, కింది తండాల్లో సేవాలాల్‌ చిత్రపటానికి జడ్పీటీసీ మాజీ సభ్యురాలు అంజలిరాములు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేపూరి రాములు పూజలు నిర్వహించి, జయంతి వేడుకలు ప్రారం భించారు. కార్యక్రమంలో బోయిన్‌పల్లి రాజు, భగవంతు, రాజారాంరాథోడ్‌, కిష్ట్యానాయక్‌, కాశ్యనాయక్‌, గోవింద్‌నాయక్‌, రామునాయక్‌, వెంకట్‌నాయక్‌ తదితరులున్నారు.

కొత్తపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో సేవాలాల్‌ కమిటీ సభ్యులు సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా జరుపుకున్నారు. బంజారా కమిటీ అధ్యక్షులు లల్యానాయక్‌. సూర్యనాయక్‌, బీమ్యానాయక్‌, గోవిందు తదితరులున్నారు.

మద్దూర్‌ పట్టణంలోని పాతబస్టాండ్‌, ఐబీ రోడ్‌, కొత్తబస్టాండ్‌ తదితర ప్రధాన రోడ్డు మార్గాల్లో గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు, వివిఽధ పార్టీల నాయకులు సలీం, గోపాల్‌, వీరారెడ్డి, లక్ష్మణ్‌నాయక్‌, అనిల్‌ నాయక్‌, రవినాయక్‌, గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:11 PM