కొలువుదీరిన ఈదమ్మ తల్లి
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:43 PM
కొల్లాపూర్ పట్టణ ప్రజలను, పిల్లలను ఆపదల నుంచి రైతులను కాపాడిన కొల్లాపూర్ గ్రామ దేవత అభయ తల్లి ఈదమ్మ ఆ లయం పునర్నిర్మాణ మహోత్సవాలు కనుల పండువగా కొనసాగాయి.

- ఆలయ పునర్నిర్మాణ మహోత్సవంలో ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠ
- గ్రామ దేవత దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
- అమ్మ వారికి పట్టు వస్ర్తాలు సమర్పించి తొలి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు
- విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
కొల్లాపూర్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్ పట్టణ ప్రజలను, పిల్లలను ఆపదల నుంచి రైతులను కాపాడిన కొల్లాపూర్ గ్రామ దేవత అభయ తల్లి ఈదమ్మ ఆ లయం పునర్నిర్మాణ మహోత్సవాలు కనుల పండువగా కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దాతృత్వంతో ఏర్పాటు చేసిన ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను దేవాలయ పునర్నిర్మాణ కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి. హిందూ ధర్మ ఆగమ శాస్త్రం ప్రకారం వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య శుక్రవారం ఈదమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా వేద పండితులు మహా కుంభాభిషేకం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించి అ మ్మ వారికి తొలి పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆయన అమ్మ వారికి పూజా కార్యక్ర మాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొని ఈదమ్మ తల్లిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. తమ తమ నివాస గృహాల్లో ఆడపడుచులకు ఒడిబి య్యం పెట్టుకుని భక్తిశ్రద్ధలతో అమ్మ వారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ... గ్రామ దేవతలు ఎప్పుడు గ్రామాల్లో ఉండే ప్రజల బాగు కోసమే ఉంటారని, రైతులకు అండగా నిలుస్తారన్నారు. పురాతన ప్రాచీన మహిమ గల ఈదమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ వేడుకలను బీరం హర్షవర్దన్ రెడ్డి నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. బీరం హర్షవ ర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ అమ్మ వారి కరుణాకటాక్షాలు కొల్లాపూర్ ప్రజలకు రైతులకు ఎల్లప్పుడు ఉండాలని అమ్మ వారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.