భూములు పోతే బతికేదెలా?
ABN , Publish Date - Feb 24 , 2025 | 11:29 PM
వ్యవసాయంపై ఆధారపడి జీవనం గడుపుతున్న తాము భూములను కోల్పోతే బతికేదెలా అని మక్తల్ మం డలం కాట్రేవ్‌పల్లి గ్రామ రైతులు అధికారులను నిలదీశారు.

- సర్వే అధికారులను అడ్డుకున్న కాట్రేవ్‌పల్లి రైతులు
- పెట్రోల్ బాటిళ్లు పట్టుకొని ఆందోళన
మక్తల్ రూరల్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయంపై ఆధారపడి జీవనం గడుపుతున్న తాము భూములను కోల్పోతే బతికేదెలా అని మక్తల్ మం డలం కాట్రేవ్‌పల్లి గ్రామ రైతులు అధికారులను నిలదీశారు. సర్వేను అడ్డు కున్నారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా మక్తల్ మండలం కాట్రేవ్‌పల్లి శివారులో పంప్‌హౌస్ నిర్మించనున్నారు. అందుకోసం భూములను సర్వే చేసేందుకు అధికారులు సోమవారం గ్రామానికి చేరుకున్నా రు. సర్వే చేసేందుకు సిద్ధమవుతున్న వారిని రైతులు అడ్డుకున్నారు. భూములు తీసుకుంటే తాము జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే కొనసాగిస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఇన్‌చార్జి సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి, తహసీల్దార్ సతీశ్‌కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి నచ్చచెప్పేం దుకు యత్నించారు. ఫలితం లేకపోవడంతో కలెక్టర్‌తో మాట్లాడుదామని వారిని నారాయణపేటకు తీసుకెళ్లారు.