Share News

గట్టుచప్పుడు కాకుండా తొలగిస్తే ఎలా?

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:37 PM

ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడం ఏమాత్రం తగదని గద్వాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు.

గట్టుచప్పుడు కాకుండా తొలగిస్తే ఎలా?

కలెక్టరేట్‌ ఎదుట స్టాఫ్‌నర్సుల నిరసన, డీఎంహెచ్‌వోతో వాగ్వాదం

కమిషనరేట్‌ నుంచి సర్క్యులర్‌ తెచ్చినా మాకు న్యాయం చేయరా?

గద్వాల క్రైం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించడం ఏమాత్రం తగదని గద్వాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా రెండు రోజుల క్రితం రెగ్యులర్‌ స్టాఫ్‌ నర్సులను నియ మించుకోవడం పలు అనుమానాలకు తావిస్తు న్నదని వాపోయారు. ఈక్రమంలోనే వారు శనివారం కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించి, వినతిప త్రం అందజేశారు. అనంతరం డీఎంహెచ్‌వో సిద్దప్పను కలిసి, సమస్యను వివరించారు. కరో నా కాలం నుంచి తాము విధుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నామని, ఇబ్బందికర పరిస్థితు ల్లోనూ విధుల్లో ఉన్న తమను గుర్తించాలని, ఉపాధి లేకుండా చేస్తే ఎలా బతకాలని ప్రశ్నిం చారు. వైద్యాధికారులు కరోనా సమయం నుంచి పనిచేసిన ఏడుగురు స్టాఫ్‌ నర్సులను తొలగించడంపై హెల్త్‌ కమిషనర్‌ను సంప్రదించగా మాకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొం టూ సర్క్యులర్‌ కూడా జారీ చేశారని తెలిపారు. అయినా అన్యాయం చేయడం ఏమిటని ప్రశ్నిం చారు. న్యాయం చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపై డీఎంహెచ్‌వో సిద్దప్పను వివరణ కోరగా కొత్తగా నియమితులైన స్టాఫ్‌ నర్సులను మెరిట్‌, రోస్టర్‌ విధానంలో 17మందిని తీసుకున్నామని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ వేసి న తర్వాత కమిషనరేట్‌ నుంచి వీరికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంటూ సర్క్యులర్‌ వచ్చింద ని, అందులో వీరిని తప్పక తీసుకోవాలనే రూల్‌ లేదని చెప్పారు. కలెక్టర్‌ఆదేశాల మేరకు కొత్తగా స్టాఫ్‌ నర్సుల పోస్టులను పూర్తిచేశామన్నారు. కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సులు నవీ నా, రాణెమ్మ, చిన్నలక్ష్మి, జోష్న, విజయ, శ్యామ ల, నీలవతి ఉన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:37 PM