ఇంటి నిర్మాణం వెంటనే ప్రారంభించాలి
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:42 PM
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎం పికైన లబ్ధిదారులు వేగంగా ఇళ్ల నిర్మాణం ప్రా రంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆద ర్శ్ సురభి ఆదేశించారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎం పికైన లబ్ధిదారులు వేగంగా ఇళ్ల నిర్మాణం ప్రా రంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆద ర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణం, ఉపాధి హామీ పనులు, బ్యాంకు లింకే జీ రుణాల అంశాలపై ఎంపీడీవోలు, ఎంపీవో లు, ఏపీఎంలతో మండలాల వారీగా కలెక్టర్ స మీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇ ళ్ల పథకానికి ఎంపికై, మంజూరు పత్రాలు అం దుకున్న లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవా లన్నారు. లబ్ధిదారులందరికీ ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించాలన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి లబ్ధిదారులకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే, స్వయం సహా యక మహిళా బృందాల ద్వారా ఏదైనా రుణం ఇప్పించేందుకు సహకరించాలన్నారు. అన్ని మ ండల కేంద్రాల్లో వేగంగా ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించా రు. మూడు రోజుల్లో అధిక సంఖ్యలో లబ్ధిదారు లు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ఎంపీడీ వోలు చూడాలన్నారు. ఎండలు ముదురుతున్న తరుణంలో పని ప్రదేశాల్లో నీటి సౌకర్యం, నీడ ఏర్పాట్లు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. మహిళా స్వయం సహాయ క సంఘాలకు సంబంధించి బ్యాంకు లింకేజీ రుణాల విషయంపై పెండింగ్ టార్గెట్‌ను ఈ నె లాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అ దనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, జి ల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్, గృహ ని ర్మాణ శాఖ అధికారులు పర్వతాలు, విఠోబా, ఎ ంపీడీవోలు, ఏపీఎంలు, ఇతర అధికారులు తది తరులు పాల్గొన్నారు.