ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
ABN , Publish Date - Jan 03 , 2025 | 11:27 PM
పేట మండలంలోని కోటకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.
నారాయణపేట రూరల్/నర్వ/ధన్వాడ/ ఊట్కూర్/కోస్గి రూరల్/మక్తల్/మాగనూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పేట మండలంలోని కోటకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసి మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సామాజిక కార్యకర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సునిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అదేవిధంగా నర్వలోని బీసీ కమ్యూనిటీ హాల్ వద్ద జ్యోతిరావు పూలే చిత్రపటానికి బీసీ స ఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాయికోడ్ గ్రామంలో సావి త్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే విగ్రహాలకు గ్రామస్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ధన్వాడలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలతో నివాళ్లు అర్పించి, ఆమె సేవలను కొనియాడారు. సావిత్రిబాయి పూలే గొప్ప సంఘ సంస్కర్త అని మత్స్యశాఖ సంఘం జిల్లా ఉపాఽధ్యక్షుడు నీరటి నర్సిములునాయుడు అన్నారు. యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. సంఘం అధ్యక్షుడు కొక్కు శంకర్, నాయకులు పాల్గొన్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్ర మంలో హెచ్‌ఎం కుసుమ, ఉపాధ్యాయులు, విద్యార్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్ర దానం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ మాజీ సభ్యుడు గోవిందప్ప, నాయకులు పాల్గొన్నారు.
కోస్గిలోని మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఉన్న పూలే దంపతుల విగ్రహాలకు టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివరాములు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. ఎంఈవో శంకర్‌నాయక్ ఆ సంఘం మండల అధ్యక్షుడు శ్రీరా ములు, నాయకులు పాల్గొన్నారు. అలాగే, మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా, నారాయణపేటలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో గెజిటెడ్ హెచ్‌ఎంలను, మహిళా ఉపా ధ్యాయులను ఘనంగా సత్కరించారు.
మక్తల్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ, సంగంబండ గురుకుల వెల్ఫేర్ పాఠశాలల్లో సావిత్రి బాయి పూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. బీసీ సంఘం, అంబేడ్కర్ సంఘం, జ్యోతిరావు పూలే బీసీ సంఘం నాయకులు పా ల్గొన్నారు.
మాగనూరులో అంబేడ్కర్ యువజన సం ఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే చిత్రప టానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. సంఘం యువజన అధ్యక్షుడు సగురం రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొల్పూరు ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహిళ ఉపా ధ్యాయులకు శాలువా, పూలమాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి, హెచ్‌ఎం తిమ్మన్న, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.