Share News

ఘనంగా కేసీఆర్‌ జన్మదినం

ABN , Publish Date - Feb 17 , 2025 | 11:31 PM

మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపు కున్నారు.

ఘనంగా కేసీఆర్‌ జన్మదినం
మక్తల్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు

నారాయణపేట/దామరగిద్ద/మరికల్‌/ధన్వాడ/కోస్గి/కొత్తపల్లి/కృష్ణ/మక్తల్‌/మద్దూర్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని సోమవారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపు కున్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కా ర్యాలయంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌ ఆధ్వర్యంలో నాయకులు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత జిల్లా ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి ఉన్నారు. అదేవిధంగా, దామరగిద్ద మండల కేంద్రంలోని సంజీవరాయ గుడి వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు సుభాష్‌ కేక్‌ కట్‌ చేశారు. అనం తరం ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళలకు, వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, మొక్కలు నాటారు. కానుకుర్తి గ్రామంలో మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భాస్కరకుమారి, వెంకట్‌రెడ్డి, ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. మరికల్‌ మండల కేం ద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తాలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య కేక్‌ కట్‌ చేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ధన్వాడలో బీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. ఎంపీటీసీ మాజీ సభ్యుడు గండి బాల్‌రాజు, నాయకులు పాల్గొన్నారు. కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిలో బీఆర్‌ ఎస్‌ నాయకులు రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. కొత్తపల్లిలో బీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు ఉన్నారు. కృష్ణలో జడ్పీటీసీ మాజీ సభ్యురాలు అంజనమ్మ తనయుడు శివరాజ్‌ పాటిల్‌ కేక్‌ కట్‌ చేశారు. మక్తల్‌ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పూజలు నిర్వహించి, అంబేడ్కర్‌ చౌరస్తాలో కేక్‌ కట్‌ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. మద్దూర్‌లోని షా గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగు లకు పండ్లు పంపిణీ చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు సలీం, కోస్గి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వీరారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అఽధ్యక్షుడు గో పాల్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - Feb 17 , 2025 | 11:31 PM