Share News

ఘనంగా మహా రథోత్సవం

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:40 PM

నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్‌ గుట్టపై వెలిసిన తిమ్మప్పస్వామి జాతర ఉత్సవాలు గు రువారం ఘనంగా జరిగాయి.

ఘనంగా మహా రథోత్సవం
ఎక్లాస్‌పూర్‌లో బాలాజీ మహా రథోత్సవం

- కొనసాగుతున్న ఎక్లాస్‌పూర్‌ జాతర

- ప్రత్యేక పూజల్లో పాలొన్న డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి

నారాయణపేట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట మండలం ఎక్లాస్‌పూర్‌ గుట్టపై వెలిసిన తిమ్మప్పస్వామి జాతర ఉత్సవాలు గు రువారం ఘనంగా జరిగాయి. జాతరోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బుధవా రం అర్ధరాత్రి మహారథోత్సవ వేడుకలు జరిగా యి. రెట్టపట్ల పోటీలు నిర్వహించారు. డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, మా ర్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొనంగేరి హ న్మంతు, మాజీ చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు సరాఫ్‌ నాగరాజ్‌ తదితరులు హాజరై స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాణిక్‌శాస్త్రి పూలమాల, శాలువాతో కుంభంను సత్కరించి, ప్రసాదమందించి ఆశీర్వదించారు.

ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టిన కుంభం

కాగా, జాతరలో వాహనాలు రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి నియంత్రణ చర్యలు చేపట్టారు. దాదాపు అరగంట పాటు మండు టెండల్లో నిలబడి ట్రాఫిక్‌ను సరిదిద్దారు. పోలీస్‌ శాఖ చేపట్టే చర్యలు కుంభం శివకుమార్‌రెడ్డి తీ సుకోవడంపై పలువురు అభినందించారు.

Updated Date - Feb 13 , 2025 | 11:40 PM