ఘనంగా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:29 PM
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు.

- బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
జడ్చర్ల/రాజాపూర్/మిడ్జిల్/నవాబ్‌పేట,బాలానగర్ ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ, సీఎన్‌ఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రేమ్‌రంగా గార్డెన్స్‌లో రక్తదాన శిబిరం నిర్వహించగా, 1071 మంది రక్తదాతలు రక్తదానం చేశారు. జిల్లా జనరల్ ఆసుపత్రి, పాలమూరు బ్లడ్ బ్యాంక్, ఎస్వీఎస్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్, రెడ్‌క్రాస్ సొసైటీల ఆధ్వర్యంలో 1071 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదానం చేసిన దాతలను మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తనయుడు స్వరణ్ అభినందించారు. అంతకుముందు కావేరమ్మపేట సమీపంలోని ఎంబీ మెడికల్ సెంటర్ నుంచి ప్రేమ్‌రంగా గార్డెన్స్ వరకు కార్లు, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి, కేకును కట్ చేశారు. రాజాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, జడ్పీటీసీ మాజీ మోహన్‌నాయక్ పాల్గొన్నారు. మిడ్జిల్ మండల భైక్‌ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ సుదర్శన్, మాజీ జడ్పీటీసీలు హైమావతి బాల్‌రెడ్డి, శశిరేఖ బాలు పాల్గొనగా, నవాబుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మాడేమోని నర్సింహులు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. మాజీ ఎంపీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. బాలానగర్ మండలం పెద్దాయపల్లి చౌరాస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు కేక్ కట్ చేశారు. అనంతరం ర్యాలీగా జడ్చర్లకు తరలివెళ్లారు.