Share News

ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు చేరాలి

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:54 PM

ప్రభుత్వ ప థకాల లబ్ధి ప్రతీ నిరుపేదకు చేరాలని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికా రులు పారదర్శకత పాటించాలని రా ష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సూ చించారు. మ

 ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు  చేరాలి
మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, చిత్రంలో మంత్రి జూపల్లి

- లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టండి

- ప్రభుత్వ పథకాల అమలులో ప్రచారలోపం ఉండకూడదు

- ఒక్కో జిల్లాలో రెండు గ్రామ సభల్లో నేరుగా పాల్గొంటా

- ఆర్‌అండ్‌ఆర్‌ కింద పథకాల వర్తింపుపై తగు చర్యలు తీసుకోవాలి

- గ్రామ సభల నిర్వహణ ద్వారా పలు సమస్యలు దృష్టికి వస్తాయి

- వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ

- ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు అధికారులతో సమీక్ష

మహబూబ్‌నగర్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వ ప థకాల లబ్ధి ప్రతీ నిరుపేదకు చేరాలని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అధికా రులు పారదర్శకత పాటించాలని రా ష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో గురు వారం ఉమ్మడి జిల్లాలోని ఎంపీలు, ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చై ర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికా రులతో కలిసి ఆయన జనవరి 26 నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు సం బంధించి పథకాల అమలు తీరు, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్లు వారి పరిధిలోని లబ్ధిదారుల సంఖ్య, పథకాల అమలు ఏర్పాట్లను మంత్రులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నా లుగు పథకాలను జనవరి 26 నుంచి ప్రారంభించనుందని తెలిపారు. పథకా ల అమలులో భాగంగా నిర్వహించే గ్రామసభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములుగా చేసు కోవాలని సూచించారు. ప్రభుత్వ ప థకాల అమలులో సమన్వయలోపం, ప్రచారలోపం ఉండకూడదని చెప్పా రు. ఈ పథకాలు ప్రజలకు చాలా మేలు చేస్తాయని, తాను సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి ఐ దు జిల్లాల్లో జిల్లాకు రెండు నుంచి మూడు గ్రామసభల్లో నేరుగా పా ల్గొంటామని తెలిపారు. ఐదు రోజుల కార్యక్రమ సమాచారం నియోజకవ ర్గాల వారీగా ఎమ్మెల్యేలకు అందిం చాలని సూచించారు. నిర్వాసితులకు సంబంధించి ప థకాల వర్తింపుపై క్షేత్రస్థాయిలో పరి శీలించి తగు నిర్ణయం తీసుకోవాల న్నారు. క్షేత్రస్థాయిలో నాలుగైదు గ్రామసభల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటే అవగాహన వస్తుందన్నారు. ఈ సభ ల ద్వారా పథకాలపై మాత్రమే కాకుండా క్షేత్రస్థాయి సమస్యలు కూడా అధికారులు, ప్రజాప్రతినిధుల కు తెలుస్తాయన్నారు. గ్రామాల వారీగా అన్ని పథకాలకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి అనే గణాంకాలు తీసుకొ ని ఎమ్మెల్యేలకు ఇస్తే వారు కూడా ఆయా గ్రా మాలకు ఏం చేశారో ప్రజలకు చెప్పుకునే వెసు లుబాటు కలుగుతుందని అన్నారు.

అందరినీ భాగస్వామ్యం చేయాలి

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గొప్ప పథకమని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆ పథకం అందని వారు నిరాశ చెంద కుండా వారిని ఉపాధి హామీ పనులకు వెళ్లి మ రోసారి దరఖాస్తు చేసుకునే విధంగా అధికారు లు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం అమలుపై ఫీల్డ్‌ అసిస్టెంట్లు వ్యతిరేక ప్ర చారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సొంత స్థలం లేని వారికి మలి దఫాలో ఇళ్లు వ స్తాయని, జాగలేని నిరుపేదలకు సర్ది చెప్పాలని సూచించారు. కొత్త పథకాల అమలులో అర్హుల ఎంపిక ప్రక్రియ సమర్థవంతంగా జరగాలని జ డ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కోరారు. ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో అనుకోని కారణాల వ ల్ల దరఖాస్తులు చేసుకోని వారికి కూడా ప్రభు త్వం పథకాల వర్తింపులో అవకాశం కల్పించేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని దేవరక ద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి సూచించారు. మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సర్వే జరిగిన చోటనే స్ర్కూటినీ చే యాలని సూచించారు. ఇళ్లు ఉన్న వారిని అర్హుల జాబితా నుంచి తొలగించాలని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నదని, ఆ ప్రభుత్వంతో మాట్లాడి జూరాలకు ఐదు టీ ఎంసీల నీటిని విడుదల చేయించాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింప జే యాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. జర్నలిస్టులు కూడా ఇందిరమ్మ ఇళ్లు అ డుగుతున్నారని, ఒకసారి పరిశీలించి అర్హులైన వారికి ఇవ్వాలని, రేషన్‌ కార్డులు కూడా అర్హలందరికీ మం జూరు చేయాలని నాగర్‌క ర్నూలు ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి కోరారు. ఇందిర మ్మ ఇళ్ల పథకంలో టెక్నికల్‌, ప్రాక్టికల్‌ సమస్య లు తలెత్తుతున్నాయని, క్షేత్రస్థాయిలో ఫిల్టర్‌ చేసిన జాబితాను గ్రామసభలో పెట్టాలని వనప ర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు మంత్రులను కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, ఉమ్మడి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ రవి, డీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, కలెక్టర్లు విజయేందిర బోయి, బదావత్‌ సంతోష్‌, ఆదర్శ్‌ సురభి, బీఎం సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

పకడ్బందీగా లబ్ధిదారులను

ఎంపిక చేయాలి

నాలుగు పథకాలను లోపాలు లేకుండా పక డ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎక్జైజ్‌, ప ర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పా రు. గ్రామసభ నిర్వహణ, క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనల ప్రకారం నడుచుకొని అర్హులందరినీ ఎంపిక చేయాలన్నారు. ఆన్‌లైన్‌ టిక్‌ చేయక పోవడం వల్ల అర్హులు కాకుండా పోతున్నారని అన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూ ములను పంచాయతీ కార్యదర్శులు నిశితంగా సర్వే చేసి గుర్తించాలన్నారు. గూగుల్‌ మ్యాపింగ్‌ ద్వారా సర్వే చేస్తు న్నారా, లేదా అని అధికారులను ఈ సందర్భం గా ప్రశ్నించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని ఓ గ్రామంలో రేషన్‌ కార్డుల దరఖాస్తుల్లో వ్యత్యాసం వచ్చిందని, అలా కా కుండా చూడాలన్నారు. గ్రామసభలు నిర్వహిం చే ముందే ఊర్లో టామ్‌ టామ్‌ వేయించాలని అధికారులను ఆదేశించారు.

- మంత్రి జూపల్లి కృష్ణారావు

Updated Date - Jan 16 , 2025 | 11:54 PM