Share News

ఘనంగా గట్టు తిమ్మప్ప, గుంటి రంగస్వామి జాతర

ABN , Publish Date - Feb 03 , 2025 | 11:26 PM

మక్తల్‌ మండలం మద్వార్‌ గట్టు తిమ్మప్ప, కర్ని గుంటిరంగస్వామి జాతర ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి.

ఘనంగా గట్టు తిమ్మప్ప, గుంటి రంగస్వామి జాతర
గట్టు తిమ్మప్ప స్వామివారికి పట్టు వస్ర్తాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు

- వైభవంగా పల్లకీసేవ, ప్రభోత్సవం

- పట్టు వస్త్రాలు సమర్పించిన మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌రూరల్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ మండలం మద్వార్‌ గట్టు తిమ్మప్ప, కర్ని గుంటిరంగస్వామి జాతర ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. సోమవారం ఉదయం మద్వార్‌, కర్ని గ్రామాల్లో వీధుల గుండా స్వామివారిని అడుగుల భజనలతో ఊరేగించారు. అనంతరం ఆలయాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా మాద్వార్‌ గట్టు తిమ్మప్పకు పట్టు వస్ర్తాలు స మర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం ప్రభోత్సవం కార్యక్రమంలో భాగంగా చిన్న తేరు కు పూజలు నిర్వహించి భక్తుల కోలాహలం న డుమ చిన్న రథాన్ని ముందుకు లాగారు. కార్య క్రమంలో గ్రామ పెద్దలు రాజేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు చిన్న రంగప్ప, శ్రీనివాస్‌ రెడ్డి, వెంకటేష్‌గౌడ్‌, మహిళలు, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 11:26 PM