సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:29 PM
కొంతకాలంగా ఆన్‌లైన్‌లో నకిలీ ధని, ముద్ర లో న్ యాప్‌తో ప్రజలను మోసం చేస్తున్న ఓ సైబ ర్ ముఠాలోని నలుగురు నేరస్థులను అరెస్టు చే సి రిమాండ్‌కు తరలించినట్లు వనపర్తి ఎస్పీ రా వుల గిరిధర్ తెలిపారు.

- రెండు రాష్ట్రాల్లో రూ.4 కోట్లు కాజేసిన ముఠాలో నలుగురి పట్టివేత - నేరస్థులంతా జిల్లా వాసులే : ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి క్రైమ్, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : కొంతకాలంగా ఆన్‌లైన్‌లో నకిలీ ధని, ముద్ర లో న్ యాప్‌తో ప్రజలను మోసం చేస్తున్న ఓ సైబ ర్ ముఠాలోని నలుగురు నేరస్థులను అరెస్టు చే సి రిమాండ్‌కు తరలించినట్లు వనపర్తి ఎస్పీ రా వుల గిరిధర్ తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడారు. కోల్‌కత్తా, ఢిల్లీ, పాట్నా కేంద్రంగా కొంతకాలంగా అంకిత్, రాహుల్, పంకజ్ అనే వ్యక్తులు వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురితో సైబర్ టీమును ఏర్పాటు చేసుకొని నకిలీ ధని, ముద్ర లోన్ యాప్‌లతో మోసాలకు పాల్పడుతు న్నట్లు తెలిపారు. అందులో భాగంగా వనపర్తి పట్టణానికి చెందిన తోగుట రాజు అనే వ్యక్తికి గ త నెల 17వ తేదీన సెల్‌ఫోన్ లో ఫేస్‌బుక్ చూ స్తుండగా ధని ఫైనాన్స్ లోన్ యాప్ కనింపించ గా దానిపై క్లిక్ చేశాడు. వెంటనే అతని సెల్‌ఫో న్‌కు ఒక నెంబర్ నుంచి ఫోన్ చేసి మేము ధని లోన్ యాప్ నుంచి మాట్లాడుతున్నామని, మీకు లోన్ కావాలా అని సంప్రదించారు. వెంటనే అ తను రూ. 3 లక్షల లోన్ కావాలని చెప్పడంతో రూ.3 లక్షల లోన్ ఇస్తామని, ప్రతీ నెల రూ.8,8 60 ఇలా 36 నెలలు తిరిగి చెల్లించాలని సూచిం చారు. మొదట ఇన్సూరెన్స్ కోసం డబ్బులు పం పించాలని వారు అడుగగా వెంటనే అతను తన కుమారుడు అరవింద్ ఫోన్ పే నుంచి రూ. 6,8 50 ధర్మేంద్ర కుమార్ అనే వ్యక్తి పేరుతో స్కాన ర్ పంపించగా వెంటనే పంపాడు. మరికొద్ది సే పటికి అదే స్కానర్‌కు రూ.8,860 చెల్లించాలని తెలుపగా మళ్లీ పంపాడు. ఈ డబ్బులు మొత్తం మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయని చెప్పడం తో రాత్రంతా చూసి మరుసటి రోజు వరకు రాక పోవడంతో మోసపోయానని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పట్టణ ఎస్‌ఐ కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ యాప్ పేరుతో రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద సంఖ్యలో మోసపోవడంతో ఈ కేసు విచారణను తెలంగా ణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గో యల్ దృష్టికి తీసుకువెళ్లగా.. డీజీపీ ఆదేశాల మే రకు ఉమ్మడిగా కలిసి దర్యాప్తు చేసినట్లు తెలి పారు. వనపర్తి ఎస్పీ ఆధ్వర్యంలో సైబర్ సె క్యూరిటీ బ్యూరో డీఎస్పీ రత్నం, ఎస్‌బీ ఎస్‌ఐ ర వి ప్రకాష్, వనపర్తి సీఐ కృష్ణయ్య, టౌన్ ఎస్‌ఐ హరిప్రసాద్, ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి 35 మం ది నేరస్థులను ఈ కేసులో గుర్తించినట్లు తెలిపా రు. అందులో శనివారం నలుగురు నేరస్థులైన వనపర్తి జిల్లా వాసులు గోపాల్‌పేట మండలం నర్సింగాయపల్లి గ్రామానికి చెందిన గగనం ప్ర కాష్ కుమార్, వనపర్తి పట్టణంలోని మర్రికుంట కు చెందిన చీరల రవిసాగర్, సాయినగర్ కాల నీకి చెందిన గుంటి రాజశేఖర్, వెంగళరావు కాల నీకి చెందిన దేవర్ల సాయికుమార్ లను అదుపు లోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి ని విచారించగా కోల్‌కతా ఢిల్లీ, పాట్నాలలో ఉం డే అంకిత్, రాహుల్, పంకజుల సహాయంతో ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని తెలిపారు. ప్రజలను మోసం చే సి సంపాదించిన డబ్బుల్లో అంకిత్, రాహుల్, పంకజ్ కు 70 శాతం మిగతా 30 శాతం వీరు పంచుకొని జల్సాలకు పాల్పడుతున్నట్లు తెలిపా రు. వీరంతా ఆన్‌లైన్ డేటా సేకరించి వారి నుం చి రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ప్రా సెసింగ్, డాక్యుమెంట్ చార్జెస్, జీఎస్టీ, ఫైల్ క్లో జింగ్ చార్జెస్ పేరుతో బాధితుల నుంచి వసూ లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ముఠాలోని నేర స్థులంతా రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 10 వేల నుంచి 15 వేల మందికి ఫోన్ చేసి మోసగి ంచాలని ప్రయత్నం చేయగా, వెయ్యి మందిని మోసగించి వారి నుంచి రూ.4 కోట్లు కాజేసిన ట్లు తెలిపారు. ఈ కాజేసిన డబ్బులతో నేరస్థు లంతా విహార యాత్రలు, పబ్బులు, జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో వచ్చే ప్ర కటనలు నమ్మి ప్రజలు ఎవరు కూడా మోసపో వద్దని, ఎక్కడైనా మోసపోయినట్లు తెలిస్తే వెం టనే సైబర్ క్రైమ్ ఫోన్ నెంబర్ 1930కు వెంటనే ఫిర్యాదు చేస్తే కేసును వేగవంతంగా పరిష్కరిం చవచ్చని తెలిపారు.