గద్వాలను ఎగుమతుల హబ్‌గా మార్చాలి: కలెక్టర్
ABN , Publish Date - Jan 31 , 2025 | 11:38 PM
జిల్లాలోని గద్వాల చీరలు, వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల ఎగుమతిని పెంచేందుకు అన్ని అవసరమైన వసతులు కల్పిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

- పత్తి, వేరుశనగ, మిరప, మామిడి, బియ్యం ఎగుమతులకు వసతులు కల్పించాలి
- గద్వాలచీరలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
గద్వాలన్యూటౌన్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గద్వాల చీరలు, వ్యవసాయ, ఇతర ఉత్పత్తుల ఎగుమతిని పెంచేందుకు అన్ని అవసరమైన వసతులు కల్పిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడుతూ జిల్లా నుంచి ఎగుమతి ప్రోత్సాహాన్ని పెంపొందించడంతో పాటు జిల్లాను ఎగుమతి హబ్‌గా మార్చేందుకు స్ధానిక ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసేందుకు జిల్లాస్ధాయి ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లా నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తు ల వివరాలను సంబంధిత అసోసియేషన్ల సహాయంతో సేకరించి, విశ్లేషించి, నివేదిక రూపంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గద్వాల చీరలు, పత్తి, వేరుశనగ, మామిడి, బియ్యం పెద్ద ఎత్తున్న ఉత్పత్తి అవుతున్నదని, వాటికి ఎగుమతికి అవకాశాలు పెంచాలని సూచించారు. అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హ్యాండ్లూమ్ తప్పనిసరిగా ఎగుమతి, దిగుమతి కోడ్(ఐఈసీ) నమోదు చేసుకోవాలని, దేశంలో నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొని గద్వాల చీరలను ప్రాచుర్యంలోకి తేవాలని చెప్పారు.