రంగు, పట్టు వల్లే గద్వాల చీరలకు మంచిపేరు
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:47 PM
నాణ్యమైన రంగులు, నాణ్యమైన కోర పట్టును ముడిసరుకుగా వాడకంవల్లే గద్వాల పట్టుచీరలకు దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చిందని శాస్త్రవేత్త లు డాక్టర్ శ్రీనివాస, డాక్టర్ నవీన్ పడకి అన్నా రు.
రంగుల అద్దకం, రాయితీలపై అవగాహన కలిగి ఉండాలి
శాస్త్రవేత్తలు శ్రీనివాస, నవీన్ పడకి, దీపక్ చౌదరి
రాజోలి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన రంగులు, నాణ్యమైన కోర పట్టును ముడిసరుకుగా వాడకంవల్లే గద్వాల పట్టుచీరలకు దేశవ్యాప్తంగా మంచిపేరు వచ్చిందని శాస్త్రవేత్త లు డాక్టర్ శ్రీనివాస, డాక్టర్ నవీన్ పడకి అన్నా రు. రాజోలిలోని రైతువేదిక భవనంలో శుక్రవా రం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో సెం ట్రల్ సిల్క్‌బోర్డు ధర్మవరంవారి రంగుల అద్ద కం, కేంద్రం రాయితీలపై అందించే సామగ్రి గు రించి చేనేత కార్మికులకు అవగాహన కల్పించా రు. రంగులు అద్దకంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రానున్న తరానికి పట్టుచీరల గొప్పతనం పెరుగుతుందన్నారు. రంగులు అద్ద కం అనంతరం చీర రంగు పోకుండా ఉండాలం టే కొన్ని మెలకువలు నేర్చుకోవాలన్నారు. ఆసక్తి ఉన్న వారు కేంద్ర సిల్క్ బోర్డు ధర్మవరం వారికి దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ శ్రీనివాస తెలిపారు. కార్మికులు ఉపయోగించే పరికరాలు, ముడిసరుకుల, మగ్గం సామగ్రి, కలర్ ఫ్యాక్టరీ యూనిట్లు సిల్క్ యూనిట్లకు 75శాతం రాయితీ ఇస్తామన్నారు. అనంతరం రంగుల అద్దకం వేసి చూపారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ లోకేష్ హాలికట్టి, అశోక్ దేశాయ్, రాజోలి చేనేత సహకార సంఘం ఇన్‌చార్జి అధ్యక్షుడు శ్రీనివాసులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దస్తగిరి, చేనేత కార్మికులు పాల్గొన్నారు.