Share News

ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Feb 15 , 2025 | 11:12 PM

రైతులు ఉచిత న్యాయ సేవలను వినియోగించు కోవాలని చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌ అన్నారు.

ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌

- చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌

- రైతు చట్టాలపై అన్నదాతలకు అవగాహన

మక్తల్‌, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రైతులు ఉచిత న్యాయ సేవలను వినియోగించు కోవాలని చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌ అన్నారు. శనివారం మక్తల్‌ మునిసిపల్‌ పరిధిలోని చందాపూర్‌ గ్రామంలో జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ ఆధ్వర్యంలో రైతు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతీ రైతు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. క్రిమి సంహారక దుకాణాల్లో కల్తీ మందులు ఇచ్చినట్లు అయితే వారి ద్వారా రశీదు పొందాలన్నారు. పంట నష్టం జరిగితే న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. ఎరువుల దుకాణాల్లో యజమానులు కల్తీ మందులు అమ్మితే చర్యలు తీసుకోవడానికి న్యాయ సేవాధికార సంస్థ ఉంటుందని, రైతులు ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మిథున్‌ చక్రవర్తి, వ్యవసాయ విస్తరణ అధికారి యోగేశ్వర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2025 | 11:12 PM