Share News

నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:47 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చేయనున్న మరో నాలుగు సంక్షేమ పథ కాలను జిల్లాలో జనవరి 26న ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు.

నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అ మలు చేయనున్న మరో నాలుగు సంక్షేమ పథ కాలను జిల్లాలో జనవరి 26న ప్రారంభించేందు కు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. ప్రభుత్వం జనవరి 26న మరో నాలు గు సంక్షేమ పథకాలు ప్రారంభించనున్న నేప థ్యంలో జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై శనివా రం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కా ర్డుల జారీ కార్యక్రమాన్ని ప్రతీ మండలంలోని ఒక గ్రామంలో జనవరి 26న మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ట్లు తెలిపారు. మండలానికి ఒక గ్రామంలో జ రిగే కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, లబ్ధిదారు లు, ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆ యా మండల ప్రత్యేక అధికారులు ఇన్‌చార్జులు గా వ్యవహరిస్తారన్నారు. అదనపు కలెక్టర్‌ (లోక ల్‌ బాడీస్‌) సంచిత్‌ గంగ్వార్‌, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జడ్పీ సీఈవో యాదయ్య, డీఆర్‌డీవో ఉమాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:47 PM