కమిటీల ఏర్పాటు
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:38 PM
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎ ంపిక పారదర్శకంగా జరిగేందుకు గ్రామ, ముని సిపల్ వార్డుల కమిటీలను నియమించినట్లు క లెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎ ంపిక పారదర్శకంగా జరిగేందుకు గ్రామ, ముని సిపల్ వార్డుల కమిటీలను నియమించినట్లు క లెక్టర్ ఆదర్శ్ సురభి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం అర్హత ఉన్న లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేసేందుకు ఈ కమిటీలు, మునిసిపల్ వార్డు క మిటీకి కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామ కమిటీలో చైర్మన్‌గా సర్పంచ్ లేదా స్పెష ల్ ఆఫీసర్ వ్యవహరిస్తారన్నారు. ఇద్దరు మహి ళా సంఘాల సభ్యులు, ముగ్గురు గ్రామ ప్రజ లు, సభ్యులుగా ఉంటారన్నారు. వీరిలో ఒకరు బీసీ, మరో వ్యక్తి ఎస్సీ, లేదా ఎస్టీ నుంచి స భ్యులుగా ఉంటారని సూచించారు. పంచాయతీ సెక్రెటరీ కన్వీనర్‌గా ఉంటారన్నారు. మునిసిపల్ వార్డుల్లో అయితే కౌన్సిలర్ లేదా స్పెషల్ ఆఫీ సర్ చైర్మన్‌గా ఉండి ఇద్దరు మహిళా సంఘాల సభ్యులు ఉంటారన్నారు. ముగ్గురు వార్డు ప్రజ ల్లో ఒకరు బీసీ ఇంకొకరు ఎస్సీ లేదా ఎస్టీ కేట గిరి నుంచి సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మునిసి పల్ వార్డులకు కమిటీలను నియమిస్తూ.. ఉత్త ర్వులు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామ కమిటీలు అర్హులైన లబ్ధిదారులతో జా బితాను తీర్మానం చేసి ఎంపీడీవోలు, మునిసి పల్ కమిషనర్లకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు.