Share News

ప్రశాంత్‌ హోటల్‌లో ఆహార తనిఖీలు

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:16 PM

పట్ణణంలోని ప్రశాంత్‌ హోటల్‌లో జిల్లా ఆహార కల్తీ నియంత్రణ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రశాంత్‌ హోటల్‌లో ఆహార తనిఖీలు
ఆహార పదార్థాలను తనిఖీ చేస్తున్న అధికారుల

మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) : పట్ణణంలోని ప్రశాంత్‌ హోటల్‌లో జిల్లా ఆహార కల్తీ నియంత్రణ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలను పరిశీలించారు. అయితే వారి తనిఖీలో భాగంగా చికన్‌ బిర్యానికి సంబంధించిన ముడి పదార్థాలను వారు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అదే విధంగా హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గానూ నోటీసులు జారీ చేశారు. ల్యాబ్‌కు పంపించిన బిర్యాని ముడి సరుకుల్లో లోపాలు ఉంటే చట్టపరమైన చర్యలు ఉంటామని హెచ్చరించారు. తనిఖీల్లో అసిస్టెంట్‌ఫుడ్‌ కంట్రోలర్‌ విజయ్‌కుమార్‌, జిల్లా ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్లు మనోజ్‌కుమార్‌, శ్రీలత, ఇన్‌చార్జి ఆఫీసర్‌ కరుణాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 11:16 PM