రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:07 PM
రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని నారాయణపేట జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీవో) మేఘాగాంధీ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు.

- డీటీవో మేఘాగాంధీ
- బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
నారాయణపేట, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని నారాయణపేట జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీవో) మేఘాగాంధీ ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక బస్‌డిపోలో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేఘాగాంధీ మాట్లాడుతూ ప్రతీరోజు రోడ్డు నియమ నిబంధ నలు పాటిస్తూ సంవత్సరాంతం ఎలాంటి ప్రమా దాలు జరుగకుండా డ్రైవర్లు వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. డిపో మేనేజర్ టి.లావణ్య మాట్లాడుతూ డ్రైవర్లు సమయపాలన పాటించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్లను ఉప యోగించొద్దని, ఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు. చలికాలంలో మంచు కారణంగా ఓవర్‌టేక్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అలివేలమ్మ, మెకానికల్ ఇన్‌చార్జి చంద్రనాయక్, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, డ్రై వర్లు పాల్గొన్నారు.